సౌదీ అరేబియా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విదేశీ విద్యార్థులకు స్పాన్సర్స్ అవసరం లేకుండానే ఎడ్యుకేషనల్ వీసాలు ఇస్తామని ప్రకటించింది. దీనికోసం తాజాగా ఆ దేశ కేబినెట్ కొత్త విద్యా వీసాలను ప్రవేశపెట్టింది. వీటిలో దీర్ఘకాలిక వీసాలను విద్యార్థులు, పరిశోధకులు, నిపుణులకు ఇవ్వనున్నారు. విద్యా ప్రయోజనాల కోసం కొత్త వీసాల జారీలో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఈ సందర్భంగా మంత్రిమండలి వెల్లడిరచింది. కింగ్ సల్మాన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇక స్వల్పకాలిక వీసాలను విద్యార్థులు, పరిశోధకులు, విజిటింగ్ ట్రైనీలకు భాషా అధ్యయనం, శిక్షణ, షార్ట్ ప్రోగ్రామ్‌లలో పాల్గొనడంతో పాటు విద్యార్థి మార్పిడి కార్యక్రమాల ప్రయోజనాల కోసం మంజూరు చేయడం జరుగుతుందని మంత్రిమండలి ప్రకటించింది.














