Namaste NRI

మీ ప్రాణాలు కాపాడుకోండి… రష్యా సైనికులకు వార్నింగ్‌

తమపై దురాక్రమణకు పాల్పడుతున్న రష్యా సైన్యం వెంటనే ఆయుధాలు వీడాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ సూచించారు. ఆయుధాలు వదిపెట్టి ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేరు. మీ కమాండర్లను నమ్మవద్దని, అసత్యాలను చెప్పే మీ నాయకులనూ నమ్మొద్దని సూచించారు. మీ ప్రాణాలు రక్షించుకోవాలంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటికే 5 వేల మందికి పైగా రష్యన్‌ ఆర్మీ ప్రాణాలు కోల్పోయిందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. తామేంటో ప్రపంచానికి ఉక్రెయినియన్లు చూపించారన్నారు. ఆ తరువాతి  పర్యవసానాలు కూడా ఎలా ఉంటాయో రష్యాకు తెలిసి వస్తోందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు పేర్కొన్నారు. తమకు మద్దతు ఇస్తున్న పశ్చిమ దేశాలకు జెలెన్‌ స్కీ ధన్యవాదాలు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events