Namaste NRI

ఏపీ సహా నాలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఉప ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌ సహా నాలుగు రాష్ట్రాల్లో త్వరలో రాజ్యసభ  ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, హర్యాణా రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఆరు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈసీ రిలీజ్‌ చేసిన షెడ్యూల్‌ ప్రకారం డిసెంబర్‌ 3వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. డిసెంబర్‌ 10ని నామినేషన్లకు చివరి తేదీగా నిర్ణయించారు. డిసెంబర్‌ 11న నామినేషన్ల పరిశీలన, 13వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు. డిసెంబర్ 20వ తేదీన పోలింగ్ ఉంటుంది. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. కాగా, ఏపీలో మోపిదేవి వెంకటరమణా రావు, బీదమస్తాన్‌రావు, ఆర్‌.కృష్ణయ్య రాజీనామాలతో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయిన విషయం తెలిసిందే.

Social Share Spread Message

Latest News