పులివెందుల మహేష్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న చిత్రం స్కూల్ లైఫ్. నైనీషా, రాహుల్ త్రిశూల్ నిర్మాతలు. సావిత్రి కృష్ణ కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి యువ హీరో కిరణ్ అబ్బవరం క్లాప్‌నిచ్చారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఈ సినిమా రూపొందిస్తున్నామని పులివెందుల మహేష్ తెలిపారు. సెప్టెంబర్‌లోగా సింగిల్ షెడ్యూల్‌లో చిత్రాన్ని పూర్తి చేస్తామని నిర్మాతలు పేర్కొన్నారు. సుమన్, ఆమని తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.