Skip to main content

Namaste NRI

స్కూల్ లైఫ్ మొదలైంది

పులివెందుల మహేష్‌ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న చిత్రం స్కూల్‌ లైఫ్‌.  నైనీషా, రాహుల్‌ త్రిశూల్‌ నిర్మాతలు. సావిత్రి కృష్ణ కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి యువ హీరో కిరణ్‌ అబ్బవరం క్లాప్‌నిచ్చారు. క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా ఈ సినిమా రూపొందిస్తున్నామని పులివెందుల మహేష్‌ తెలిపారు. సెప్టెంబర్‌లోగా సింగిల్‌ షెడ్యూల్‌లో చిత్రాన్ని పూర్తి చేస్తామని నిర్మాతలు పేర్కొన్నారు. సుమన్‌, ఆమని తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

Social Share Spread Message

Latest News