అగ్నిపథ్ స్కీమ్‌పై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. కాగా, అగ్నిపథ్ నిరసన జ్వాలలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మండిపోయింది. రైల్వే ట్రాక్‌పైనే వేలాదిమంది ఆందోళనకారులు ఉండిపోయారు. ఆందోళన విరమించకపోతే కాల్పులు జరుపుతామని హెచ్చరించారు రైల్వే పోలీసులు. అయితే కాల్పులు జరిపినా వెనక్కి తగ్గేది లేదని ఆందోళనకారులు అన్నారు. ఉదయం హఠాత్తుగా మొదలైన అగ్నిపథ్ నిరసనల కార్యక్రమం హింసాత్మకంగా మారింది. స్టేషన్లో ఉన్న రైళ్ల కిటీకి అద్దాలను ధ్వంసం చేసి స్టాళ్లను సైతం పగలకొట్టారు. ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుకు నిప్పు పెట్టడంతో నిరసనలు ఒక్కసారిగా వేడెక్కాయి. లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ లాభం లేకపోవడంతో గాల్లోకి రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసులు జరిపిన కాల్పులో ఒక వ్యక్తి మరణించగా పలువురికి గాయాలయ్యాయి. ఛాతీలో బుల్లెట్ దిగడంతో యువకుడిని హుటాహుటిన పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆ యువకుడు మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. కాల్పులో మరణించిన వ్యక్తి వరంగల్‌కు చెందిన రాకేష్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఆందోళనలో గాయపడిన పలువురు యువకులు సైతం గాంధీ ఆసుపత్రికి తరలించారు.














