అమెరికాలో నిషేధిత ఫార్మా పదార్థాల వినియోగం హద్దులు దాటిపోయి సమాజంపై తీవ్ర దుష్ఫరిణామాలు చూపిస్తోంది. ఈ డ్రగ్స్‌ను అధిక మోతాదుల్లో వినియోగించిన కారణంగా గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరు వరకూ ఏకంగా లక్ష మంది మరణించారు. ఈ గణాంకాలు అమెరికాలో సంచలనం కలిగిస్తున్నాయి. దేశంలో ఇంతకుముందెన్నడూ ఈ స్థాయిలో ప్రజలు డ్రగ్స్ అపరిమిత వినియోగానికి బలికావడం చూడలేదని అక్కడి వైద్య వర్గాలు చెబుతున్నాయి. మునుపటితో పోలిస్తే ఈ మారు మరణాల సంఖ్య 30 శాతం పెరిగిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ మరణాల్లో అధిక శాతం ఫెంటైనైల్ అనే నిషేధిత ఓపియాయిడ్ డ్రగ్ కారణంగానే సంభవించాయని తెలుస్తోంది. దీనికి తోడు కరోనా కారణంగా అనేక మంది ప్రామాణిక వైద్య సదుపాయాలకు దూరమయ్యారని, ఇటువంటవవి వారు ఈ డ్రగ్స్‌కు బలయ్యారని అక్కడి వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామం పట్ల అమెరికా అధ్యక్షుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదో విచారకరమైన మైలురాయి అని వ్యాఖ్యానించారు.














