Namaste NRI

ఏప్రిల్‌ 1న సేవాదాస్‌ విడుదల

కేపీఎస్‌ చౌహäన్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా సేవాదాస్‌. ప్రీతి అస్రానీ, వినోద్‌ రైనా, రేఖ నిరోష హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుమన్‌, భాను చందర్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్ర వివరాలు తెలిపే కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కెపీఎస్‌ చౌహాన్‌ మాట్లాడుతూ 64 దేశాల్లో 18 కోట్ల బంజారాలు ఉన్నారు.  బంజారా, తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో తెరకెక్కిన చిత్రమిది. మంచి విజయం సాధిస్తుందనే నమ్మం ఉందన్నారు. సేవాదాస్‌ బాగా వచ్చేందుకు శ్రమించిన అందరి థ్యాంక్స్‌ అన్నారు ఇస్లావత్‌ వినోద్‌ రైనా, సీతారామ్‌ నాయక్‌. అనంతరం సుమన్‌, భాను చందర్‌ మాట్లాడుతూ బంజారా సంస్కృతిని, ఔన్నత్యాన్ని చాటే ఈ సినిమాలో నటించడం గర్వంగా

ఉంది. నటులుగా పూర్తి సంతృప్తినిచ్చిన చిత్రమిది. ప్రేక్షకులు మంచి విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాం అన్నారు. శ్రీశ్రీ హాథీరామ్‌ బాలాజీ క్రియేషన్స్‌ పతాకంపై ఇస్లావత్‌ వినోద్‌ రైనా, సీతారామ్‌ నాయక్‌ నిర్మాతలు.  ఈ సినిమా ఏప్రిల్‌ 1న తెలుగుతో పాటు బంజారా, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో విడుదల అవుతున్నది. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ బాలు ఎమ్‌.చౌహాన్‌, వినోద్‌ రైనా, రేఖా నిరోష మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా : విజయ్‌ టాగోర్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events