ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ సదస్సుకు భారత్ వేదిక అయింది. ఢిల్లీ లోని భారత మండపంలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్'(India AI Impact Summit)లో 118 దేశాలు పాల్గొన్నాయి.ప్రారంభ కార్యక్రమంలో పలువురు దేశాధినేతలు, టెక్ దిగ్గజాలు పాల్గొని కీలక ప్రసంగం చేశారు. భారత్ డిజిటల్ రంగంలో విప్లవాత్మక మార్పులు సాధిస్తుందని, ఏఐ కేంద్రంగా మారుతుందని ప్రశంసించారు. ఏఐ నిర్మాణం అందరికీ ఉపయోగంగా ఉంటుందని కొత్త ఆవిష్కరణలు ఆర్ధిక వ్యవస్థను అభివృద్ధి పథంలో నడిపిస్తాయని అభిప్రాయపడ్డారు. భారత్ కు వచ్చిన ప్రతిసారి వేగంగా జరుగుతున్న మార్పును చూసి ఆశ్చర్యంగా ఉంటుందని గూగుల్ సిఈఓ సుందర్ పిచయ్ తెలిపారు.
డిజిటల్ రంగంలో భారత్ విప్లవవాత్మ మార్పులు సాధిస్తుందని. గతంలో భారత్ లో బ్యాంక్ ఖాతాలను తెరవాలంటే కష్టంగా వుండేదని ప్రస్తుతం ఎలాంటి పత్రాలు లేకుండానే ఫోన్ ద్వారానే ఖాతాలను తెరిచే సౌలభ్యం ఉందని, 140 కోట్ల మంది ప్రజలకు డిజిటల్ ఐడెంటిటి భారత్ తీసుకొచ్చిందని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ప్రశంసించారు.


















