కామెడియన్, కామెడీ హీరోగా ఎన్నో చిత్రాల్లో ప్రేక్షకుల్ని అలరించిన షకలక శంకర్, పావని జంటగా రమణ మోగిలి తెరకెక్కించిన చిత్రం ధర్మస్థలి. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రమణ మోగిలి మాట్లాడుతూ శంకర్‌తో ఇలాంటి కథను ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు. అన్ని రకాల వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉన్న చిత్రమిది. ప్రతిరోజూ మన జీవితాలతో ఆడుకుంటున్న ఓ అంశాన్నే ఈ సినిమా ద్వారా తెలియజేస్తున్నాం. శంకర్ మార్క్ వినోదం కనిపిస్తుంది. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తామన్నారు. ఈ చిత్రంలో శంకర్, పావని, మనిభట్టాచార్య, సన్ని సింగ్, షియాజి షిండే, ధనరాజ్, విజయ్ భాస్కర్, మాధవి, హసిని, రమ్య, స్వాతి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : వినోద్ యాజమాన్య, ఛాయాగ్రహణం : జి.ఎల్.బాబు. ఎం.ఆర్.రావు నిర్మాత. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.














