సమంత కథానాయికగా నటిస్తున్న చిత్రం శాకుంతలం. గుణశేఖర్ దర్శకుడు. మహాభారతంలోని శకుంతల, దుష్యంతుడి అజరామరమైన ప్రేమకథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తిమళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నవంబర్ 4న భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నట్లు గతంలో ప్రకటించారు. తాజాగా ఈ చిత్రాన్ని త్రీడీ హంగులతో తీర్చిదిద్దుతున్నారు. అందుకు కొంత సమయం తీసుకుంటుంది కాబట్టి త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని దర్శకుడు గుణశేఖర్ తెలిపారు. ఈ చిత్రంలో శకుంతలగా సమంత, దుష్యంతుడిగా దేవ్‌మోహన్ నటించారు. మోహన్ బాబు, సచిన్ ఖేడేకర్, కబీర్ బేటీ, ప్రకాష్‌రాజ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుణ టీమ్ వర్క్స్ పతాకాలపై నీలిమ గుణ తెరకెక్కిస్తున్నారు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.