శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శ్రీనగర్‌కు నేరుగా విమాన సర్వీసు ప్రారంభమైంది. ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం ఉదయం 6:15 గంటలకు 88 మందితో శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి శ్రీనగర్‌కు బయల్దేరి వెళ్లింది. ఈ సర్వీసులు ప్రతీ సోమ, బుధ, శుక్ర, శనివారాలు నడుస్తాయని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. కొవిడ్ రెండో దశ ముగిసిన తర్వాత విమానయాన రంగం ఇప్పుడిప్పుడే పుంజుకుంటోందని, జాతీయ విమాన సర్వీసుల్లో 90 శాతం మేర ప్రారంభమయ్యాయని వారు తెలిపారు.