సిరియాలో తిరుగుబాటుదళాల ఆక్రమణతో అధికారం కోల్పోయిన మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి ఆయన రష్యాలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. మొన్నటికి మొన్న అసద్ నుంచి భార్య అస్మా అసద్ విడాకులు కోరుకుంటున్నట్లు తెలిసిందే. తాజాగా అస్మా అసద్ ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నట్లు తెలిసింది.
అస్మా అల్ అసద్ గత కొంత కాలంగా లుకేమియా తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యాధి తీవ్రమైనట్లు తెలుస్తోంది. రష్యాలోని రహస్య ప్రదేశంలో ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నట్లు తెలిసిందే. ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు పేర్కొంది. ఆమె బతికే అవకాశం 50/50 మాత్రమే ఉందని సదరు కథనాలు నివేదిస్తున్నాయి.