Namaste NRI

యాపిల్‌ యూజర్లకు షాక్‌.. ఐఫోన్‌ 12పై

యాపిల్ సంస్థ‌కు చెందిన ఐఫోన్ 12 పై ఫ్రాన్స్‌లో బ్యాన్ విధించారు. ఆ ఫోన్ నుంచి అధిక స్థాయిలో రేడియేష‌న్ వ‌స్తున్న‌ట్లు నేష‌న‌ల్ ఫ్రీక్వెన్సీ ఏజెన్సీ పేర్కొన్న‌ది. యురోపియ‌న్ యూనియ‌న్ విధించిన ఆంక్ష‌ల క‌న్నా ఎక్కువ స్థాయిలో ఐఫోన్ 12 స్మార్ట్‌ఫోన్ నుంచి ఎల‌క్ట్రోమ్యాగ్న‌టిక్ త‌రంగాలు రిలీజ్ అవుతున్న‌ట్లు ఫ్రాన్స్ ఆరోపించింది. మార్కెట్లో ఉన్న అన్ని ఐఫోన్ 12 ప్రో ఫోన్ల‌ను త‌క్ష‌ణ‌మే అమ్మ‌డం ఆపివేయాల‌ని ఆ దేశం పేర్కొన్న‌ది.

ఈయూ ప్ర‌కారం ఆ ఫోన్ సిగ్న‌ల్స్‌లో స్పెసిఫిక్ అబ్జార్ప‌ష‌న్ రేట్ అధికంగా ఉన్న‌ట్లు తేల్చారు. ఐఫోన్ 12 చేతుల్లో ఉన్నా,  జేబులో ఉన్నా,  దాని నుంచి నాలుగు వాట్స్(వాట్స్‌-కేజీ) శ‌క్తి రిలీజ్ అవుతోంది. అయితే ఆ ఫోన్ బ్యాగులో ఉన్న‌ప్పుడు దాని నుంచి కేవ‌లం రెండు వాట్స్ శ‌క్తి వ‌స్తోంద‌ని రిపోర్టు ద్వారా తెలిసింది. ఇప్పటికే అమ్ముడుపోయిన ఫోన్లలో ఈ లోపాలను సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని యాపిల్‌ కంపెనీని ఆదేశించింది. లేదంటే వాటిని కూడా రీకాల్‌ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. దీనిపై రెండు వారాల్లోగా స్పందించాలని తెలిపింది. కాగా, ఈ ఆరోపణలను యాపిల్‌ కంపెనీ ఖండించింది. తమ ఉత్పత్తి ప్రపంచ దేశాల ప్రమాణాల ప్రకారమే ఉందని తెలిపింది. వివిధ దేశాలు, ప్రైవేటు ల్యాబ్‌ల ప్రమాణాలను అందుకున్నట్టు చూపించే నివేదికలను ఏఎన్‌ఎఫ్‌ఆర్‌కు సమర్పించామని పేర్కొంది. ఈ విషయం గురించి ఏఎన్‌ఎఫ్‌ఆర్‌తో చర్చిస్తున్నామని యాపిల్‌ కంపెనీ తెలిపింది.

Social Share Spread Message

Latest News