ఒక దేశానికి మంత్రి. ఓ ఈవెంట్‌లో ఆమె చేసిన పనికి అందరూ షాకయ్యారు. ఆ హఠాత్పరిణామానికి ఒక్క సారిగా నోరెళ్లబెట్టారు. కానీ ఆ దేశ ప్రధాని జొనాస్ మాత్రం ఆమెను అభినందించారు. నార్వే దేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నార్వే దేశానికి చెందిన లుబ్నా జాఫెరీ అనే 40 ఏళ్ల మహిళ ఆ దేశంలోని కల్చర్ అండ్ జెండర్ ఈక్వాలిటీ శాఖ కు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నార్వేలో ఓస్లో పేరిట ఓ ప్రైడ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. అన్ని జెండర్లకు సంబంధించిన వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ వేడుకలో ఆ మహిళా మంత్రికి గే మామ్ 2024 పురస్కారాన్ని అందజేశారు. ఈ పురస్కారాన్ని అందుకునేం దుకు వేదిక మీదకు వచ్చిన ఆమె పురస్కారం అందుకున్న తర్వాత తన షర్ట్‌ను పైకెత్తి వక్షజాలను ప్రదర్శిం చారు. అబ్బాయిలతోపాటు అమ్మాయిలు కూడా సరిసమానమే అని చెప్పడమే ఆమె ఉద్దేశమంటూ కొందరు ఆ చర్యను సమర్థిస్తున్నారు. మహిళ, పైగా మంత్రి అయ్యుండి లుబ్నా ఇలా చేయడం పట్ల మరికొందరు విమర్శ లు చేస్తున్నారు. అయితే నార్వే ప్రధాని జోనస్ ఆమెను అభినందించారు. లుబ్నా చేసింది నిజంగా సాహసో పేతమైన పని అని కొనియాడారు.