Skip to main content

Namaste NRI

నార్వే దేశంలో షాకింగ్ ఘటన… మహిళా మంత్రి  చేసిన పనికి అందరూ

ఒక దేశానికి మంత్రి.  ఓ ఈవెంట్‌లో ఆమె చేసిన పనికి అందరూ షాకయ్యారు. ఆ హఠాత్పరిణామానికి ఒక్క సారిగా నోరెళ్లబెట్టారు. కానీ ఆ దేశ ప్రధాని జొనాస్‌  మాత్రం ఆమెను అభినందించారు. నార్వే దేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  నార్వే దేశానికి చెందిన లుబ్నా జాఫెరీ అనే 40 ఏళ్ల మహిళ ఆ దేశంలోని కల్చర్ అండ్ జెండర్ ఈక్వాలిటీ శాఖ కు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నార్వేలో ఓస్లో పేరిట ఓ ప్రైడ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. అన్ని జెండర్లకు సంబంధించిన వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ వేడుకలో ఆ మహిళా మంత్రికి గే మామ్ 2024 పురస్కారాన్ని అందజేశారు. ఈ పురస్కారాన్ని అందుకునేం దుకు వేదిక మీదకు వచ్చిన ఆమె పురస్కారం అందుకున్న తర్వాత తన షర్ట్‌ను పైకెత్తి వక్షజాలను ప్రదర్శిం చారు. అబ్బాయిలతోపాటు అమ్మాయిలు కూడా సరిసమానమే అని చెప్పడమే ఆమె ఉద్దేశమంటూ కొందరు ఆ చర్యను సమర్థిస్తున్నారు.  మహిళ, పైగా మంత్రి అయ్యుండి లుబ్నా ఇలా చేయడం పట్ల మరికొందరు విమర్శ లు చేస్తున్నారు. అయితే నార్వే ప్రధాని జోనస్‌ ఆమెను అభినందించారు. లుబ్నా చేసింది నిజంగా సాహసో పేతమైన పని అని కొనియాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events