కెనడాలో సిక్కు ఓటర్ల ప్రాపకం కోసం భారత్‌పై విషప్రచారం చేస్తున్న ప్రధాన మంత్రి జస్టిన్ ట్రుడోకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. దీంతో త్వరలో ప్రధాని పదవికి ట్రూడో రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రూడోతో తలెత్తిన విధానపరమైన విభేదాల వల్ల కెనడా ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీల్యాండ్ తన పదవికి రాజీనామా చేశారు. తాజా గా ఆయన మిత్రుడు, ఖలిస్థానీ మద్దతుదారుడు, ఎన్‌డీపీ నేత జగ్మీత్ సింగ్ కూడా ట్రూడో రాజీనామా చేయాలని పట్టుబట్టాడు.