ఆశిష్ హీరో గా నటిస్తున్న తాజా చిత్రం సెల్ఫిష్. కాశీ విశాల్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై దిల్‌రాజు-శిరీష్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతున్నది. ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు.ఈ సందర్భంగా కొత్త స్టిల్స్‌ను విడుదల చేశారు. ఆశిష్, ఇవానా ట్రెండీ లుక్‌లో కనిపించారు. వినూత్న కథాంశంతో రూపొందిస్తున్న యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ ఇది. యువతరానికి కనెక్ట్ అయ్యే అన్ని అంశాలుంటాయి. మిక్కీ జే మేయర్ సంగీతం ప్రధానాకర్షణగా నిలుస్తుంది అన్నారు.ఈ సినిమా మొదటి పాట దిల్ కుష్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి కెమెరా: ఆచార్య వేణు, సహనిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, అశోక్ బండ్రెడ్డి, రచన-దర్శకత్వం: కాశీ విశాల్.
