Namaste NRI

కూలీలో శృతి హాసన్.. ఫ‌స్ట్ లుక్ రిలీజ్

సూపర్ స్టార్ రజనీకాంత్, త‌మిళ అగ్ర ద‌ర్శ‌కుడు లోకేష్ కనగ‌రాజ్ కాంబినేషన్‌లో వ‌స్తున్న తాజా చిత్రం కూలీ. సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధిమారన్ ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు.  సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఈ చిత్రం ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.

అయితే ఈ మూవీ నుంచి ఒక్కొక్క పాత్ర‌ను మేక‌ర్స్ రివీల్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు మ‌రో పాత్ర‌ ను రివీల్ చేశారు. ఈ సినిమాలో త‌మిళ న‌టి శృతి హాస‌న్ ప్రీతి అనే పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు తెలిపింది. ఈ సంద‌ర్భంగా ప్రీతి ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేసింది. ఇప్ప‌టికే మ‌ల‌యాళ న‌టుడు, మంజుమ్మెల్ బాయ్స్ ఫేం సౌబిన్ షాహిర్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన చిత్ర‌బృందం అక్కినేని నాగార్జున సైమ‌న్ అనే పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు ప్ర‌కటించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events