అధికార మార్పిడికి సిద్ధమవుతున్న తరుణంలో అమెరికాలో మరోసారి ఆర్థిక ప్రతిష్టంభన నెలకొంది. క్రిస్మస్ సమయం లో షట్‌డౌన్ ముప్పును తప్పించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ద్వైపాక్షిక ప్రణాళిక ను కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. దీనిపై తప్పనిసరిగా చర్చ జరిగేలా చూడాలని స్పీకర్ మైక్ జాన్సన్, రిపబ్లికన్ చట్టసభ్యులకు కోరారు. ఫెడరల్ ప్రభుత్వం వద్ద నిధులు తరిగిపోతున్న తరుణంలో ఈ అనూహ్య పరిణామంతో కార్యకలాపాలు స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడిరది. ట్రంప్ ఈ నిర్ణయం వెనుక ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రభావం ఉన్నట్లు సమాచారం.