లండన్‌లో ఎన్నారై యూకే శాఖ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించి గులాబీ జెండా పండుగ జరిపారు. ఆ తర్వాత కేక్ కట్ చేసి బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతీ బీఆర్‌ఎస్ కార్యకర్తలకు, నాయకులకు బీఆర్ఎస్ యూకే శాఖ అధ్యక్షుడు నవీన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో దేశంలోనే మన రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలబెట్టిన బీఆర్‌ఎస్‌ని మనం కాపాడుకోవాలలన్నారు. కేసీఆర్ నాయకత్వమే మనకు శ్రీరామా రక్ష అన్నారు.

చారిత్రాత్మక రజతోత్సవ సభకు ప్రజలంతా భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ యూకే ఉపాధ్యక్షుడు సతీశ్ రెడ్డి గొట్టెముక్కల కోరారు. నాటి ఉద్యమం నుంచి నేటి వరకు లండన్ నుంచి ప్రత్యేక కార్యాచరణతో అనుక్షణం పార్టీ వెంట ఉన్నామని, అవకాశం కలిపించిన కేసీఆర్, కేటీఆర్, పార్టీ పెద్దలకు ఉపాధ్యక్షుడు సత్యమూర్తి చిలుముల కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రవి కుమార్ రేటినేని, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్ గణేశ్ కుప్పాల, కార్యదర్శి సురేష్ గోపతి, ఐటీ-మీడియా కార్యదర్శి రవి ప్రదీప్ పులుసు, కోశాధికారి సురేష్ బుడగం, కమ్యూనిటీ అఫైర్స్ చైర్మన్ రమేశ్ ఇస్సంపల్లి, లండన్ ఇంచార్జ్ సత్యపాల్ రెడ్డి పింగలి, సంయుక్త కార్యదర్శులు నవీన్ మాదిరెడ్డి, రామకృష్ణ కలకుంట్ల, యూత్ వింగ్ కార్యదర్శి ప్రశాంత్ మామిడాల, సోషల్ మీడియా-మెంబర్‌షిప్ కో ఆర్డినేటర్ అంజన్ రావు, సభ్యులు పవన్ కల్యాణ్, సంతోష్, ఉదయ్, అజయ్ రావు గండ్ర పాల్గొన్నారు.
