Namaste NRI

కంటెంట్‌ ఉన్న కథ కాబట్టి..కచ్చితంగా నచ్చుతుంది : గెటప్‌ శ్రీను

గెటప్‌ శ్రీను  కథనాయకుడిగా నటించిన చిత్రం రాజుయాదవ్‌. కృష్ణమాచారి దర్శకుడు. కె.ప్రశాంత్‌రెడ్డి, రాజేశ్‌ కల్లెపల్లి నిర్మాతలు. నేడు సినిమా విడుదల కానుంది.ఈ సందర్భంగా గెటప్‌శ్రీను విలేకరులతో ముచ్చటించా రు.  ఫుల్‌లెన్త్‌ కనిపించే ప్రధాన పాత్ర చేశానంతే. హీరోనని నేను అనుకోను. అసలు హీరో కావాలని నాకు లేదు. అభినయానికి అవకాశం ఉన్న పాత్రలు చేయడమే నాకిష్టం. కేరక్టర్‌ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా స్థిరపడాలనేది నా లక్ష్యం. అయితే, రాజుయాదవ్‌ కథ విన్నాక ఫుల్‌లెన్త్‌ నటించడానికి అవకాశం దొరికింది అనిపించింది. అందుకే ఈ సినిమా చేశాను అని అన్నారు. ఇందులో నాది చాలా కష్టమైన పాత్ర. ఒకానొక దశలో ఫెయిల్‌ అయిపోయానేమో అనుకున్నా. దర్శకుడు ఇచ్చిన స్ఫూర్తి వల్లే ఇది సాధ్యమైంది. ఇందులోని విజువల్స్‌, సన్నివేశాలు, మాటలు  అన్నీ సహజంగా ఉంటాయి.

కంటెంట్‌ ఉన్న సినిమా కాబట్టి కచ్చితంగా జనానికి నచ్చుతుంది అని నమ్మకం వెలిబుచ్చారు. తల్లిదండ్రు లు తన బిడ్డల నుంచి ఏం కోరుకుంటున్నారు? అలాగే కొడుకు కోణంలో తల్లిదండ్రులు ఎలా ఉండాలి? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ సినిమా. తల్లిదండ్రుల కలల్ని సాకారం చేయడానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనక్కు తగ్గకూడదని చెప్పే సినిమా ఇది. ఫన్‌తో పాటు అద్భుతమైన ఎమోషన్స్‌తో ఈ సినిమాను ఆవిష్కరిం చాడు దర్శకుడు కృష్ణమాచారి. ఇందులో ప్రతి పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సాంకేతికంగా కూడా అందరూ మెచ్చేలా సినిమా ఉంటుంది అని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events