Namaste NRI

సీతారామం ప్రీ రిలీజ్‌ వేడుక

దుల్కర్‌ సల్మాన్‌, మణాల్‌ ఠాకూర్‌, మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం సీతా రామం. ఈ చిత్రాన్ని స్వపన్న సినిమా, వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ నిర్మించారు. హను రాఘవపూడి దర్శకుడు. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా స్టార్‌ హీరో ప్రభాస్‌ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  థియేటర్‌ లో చూడాల్సిన సినిమా సీతారామం. ఈ సినిమాలో అందమైన ప్రేమ కథను తెరకెక్కించారు. రష్యా, కశ్మీర్‌ లాంటి లొకేషన్స్‌లో షూట్‌ చేశారు. ఇలాంటి సినిమా చేయడం సాధారణ విషయం కాదు. మన ఇంట్లో పూజ గది ఉన్నా గుడికి వెళ్లినట్లే సినిమాలను కూడా థియేటర్‌లోనే చూడండి. సినిమాలకు థియేటర్‌ ఒక దేవాలయం లాంటిది అన్నారు. నిర్మాత స్వప్నదత్‌ మాట్లాడుతూ ప్రభాస్‌ సాధారణంగా బయటకు రారు. ఆయన ఈ కార్యక్రమానికి రావడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి మా కోసం వచ్చారు, రెండు థియేటర్‌ లో సినిమాను బతికించడానికి వచ్చారు.  ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నాం అన్నారు. దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ ఒక యుద్ధం చేయాలంటే సైన్యం కావాలి. ఈ సినిమా చిత్రీకరణలో రోజూ అలాంటి యుద్ధమే చేశాం. టీమ్‌ అంతా సైన్యంలా పనిచేశారు. ఒక గొప్ప చిత్రాన్ని రూపొందించామని గర్వంగా చెప్పగలను అన్నారు.

                సినిమా చూస్తున్నంత సేపూ చూపు తిప్పుకోలేరు కథలోని పాత్రలన్నీ మీకు సన్నిహితులుగా మారిన అనుభుతి పొందుతారు అన్నారు. హీరో దుల్కర్‌ సల్మాన్‌ మాట్లాడుతూ ఈ సినిమాతో సాగిన సుదీర్ఘ ప్రయాణం ముగింపునకు వచ్చింది. అందంగా రాసిన, తెరకెక్కించిన చిత్రమిది. లెఫ్టినెంట్‌ రావ్‌ పాత్ర పోషించడం ద్వారా సైనిక సోదరులందరికీ నా గౌరవాన్ని తెలియజేశాను.  ఈ సినిమా మా చిత్ర బందానికి ఎన్నో మర్చిపోలేని అనుభూతులు మిగిల్చింది. నిజాయితీగా ఒక ప్రేమ కథను చూపించబోతున్నాం అన్నారు. నాయిక మణాల్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ ఈ చిత్రంలోని కథా కథనాలు మిమ్మల్ని కదలిస్తాయి. రామ్‌ సీత ప్రేమ కథను ప్రతి క్షణం ఆస్వాదిస్తారు అని చెప్పింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events