Namaste NRI

సితార అరుదైన ఘనత ఘనత..న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు గారాల పట్టి సితారకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్‌ ఉంది. సితారకు సంబంధించిన పలు డ్యాన్స్‌ వీడియోలు మహేష్‌ భార్య నమ్రత పోస్ట్‌ చేస్తూ ఉంటుంది. అవి క్షణాల్లోనే వైరల్‌ అవుతుంటాయి. అంతేకాకుండా సితార ఓ యూట్యూబ్‌ చానెల్‌ను కూడా రన్‌ చేస్తుంది. ఇలా చిన్నతనంలోనే తండ్రికి తగ్గ తనయికగా పేరు తెచ్చుకుంది. ఈ మధ్య మహేష్‌తో కలిసి పలు షోలకు అటెండ్‌ అవుతూ సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. తాజాగా సితార మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది.

ప్రముఖ బంగారు నగల తయారీ సంస్థ పిఎంజె జివెల్స్ ప్రత్యేకంగా సితార కలెక్షన్ పేరుతో ఓ స్పెషల్ బ్రాండ్‌ని సృష్టించింది. రీసెంట్‌గానే దీనికి సంబంధించిన యాడ్‌ను షూట్‌ చేశారు. కాగా,  ఇప్పుడు ఈ యాడ్‌కు సంబంధించిన ఫొటోల‌ను ప్రెస్టీజియ‌స్ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో ప్రద‌ర్శించారు. ఇంత చిన్న వయసులోనే సితార ఇలాంటి ఘనత సాధించడంతో మహేష్‌ మురిసిపోతున్నాడు. సితారను చూస్తే గర్వంగా ఉందని ఈ ఫోటోలను అభిమనులతో పంచుకున్నాడు.

Social Share Spread Message

Latest News