Namaste NRI

ఆర్మీ ఆఫీసర్‌గా శివ కార్తికేయన్‌.. అమరన్‌ ట్రైలర్‌ వచ్చేసింది

శివకార్తీకేయన్‌, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం అమరన్‌. రాజ్‌కుమార్‌ పెరియస్వామి దర్శకుడు. కమల్‌హాసన్‌, ఆర్‌.మహేంద్రన్‌ నిర్మాతలు. ఇండియాస్‌ మోస్ట్‌ ఫియర్‌లెస్‌ అనే పుస్తకంలోని మేజర్‌ వరదరాజన్‌ అధ్యాయం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ను హీరో నాని విడుదల చేశారు. అణువణువునా దేశభక్తిని నింపుకున్న ఆర్మీ ఆఫీసర్‌ మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ స్ఫూర్తిదాయక జీవిత ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. వరదరాజన్‌ భార్యగా సాయిపల్లవి కనిపించింది. దేశభక్తి, కుటుంబ అనుబంధాలు, త్యాగం అంశాల నేపథ్యంలో ట్రైలర్‌ ఆకట్టుకుంది. దేశ సేవలో మేజర్‌ వరదరాజన్‌ చేసిన త్యాగాలకు నివాళిగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రాన్ని శ్రేష్ట్‌ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. దీపావళి సందర్భంగా అక్టోబర్‌ 31న ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News