Namaste NRI

శివకార్తికేయన్‌ ప్రిన్స్‌ మూవీ .. టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ విడుదల

శివ కార్తికేయన్‌ హీరోగా కె.వి. అనుదీప్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే.  ఈ మూవీలో ఉక్రెయిన్‌ బ్యూటీ  మరియా ర్యాబోషప్క కథానాయిక. తెలుగు, తమిళ భాషల్లో తెరెక్కుతోన్న ఈ ద్విభాషా చిత్రానికి ప్రిన్స్‌ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ మేరకు ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. ఆ  పోస్టర్‌ లో కార్తికేయన్‌ తెల్లటి దుస్తులు ధరించి, చేతిలో గ్లోబ్‌ పట్టుకొని శాంతిని ప్రబోధించే వ్యక్తిలా కనిపించారు. ఇదొక చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. భారత్‌లోని పుదుచ్చేరి, బ్రిటన్‌లోని లండన్‌ నేపథ్యాల్లో సాగుతుంది. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉంది. సునీల్‌ నారంగ్‌, డి.సురేష్‌బాబు, పుస్కుర్‌ రామ్‌ మోహన్‌ రావు, సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆగస్టు 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం అని చిత్రం బృందం తెలిపింది. తమన్‌ స్వరాలందిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events