Namaste NRI

ఆరడుగుల బుల్లెట్ ట్రైలర్

గోపీచంద్‌, నయనతార హీరో హీరోయిన్లుగా బి. గోపాల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆరడుగుల బుల్లెట్‌. జయ బాలాజీ రియల్‌ మీడియా బ్యానర్‌ మీద తాండ్ర రమేష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 8న మూవీ థియేట్రికల్‌ రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్‌. పేరు శివ, పుట్టింది బెజవాడ.. పెరిగింది హైదరాబాద్‌..పరిచయమైతే నేను మర్చిపోను..పంగా అయితే నువ్వు మర్చిపోలేవ్‌ అని గోపీచంద్‌ చెప్పే డైలాగ్‌తో ఈ ట్రైలర్‌ ప్రారంభమవుతుంది. ఈ ట్రైలర్‌ను చూస్తే బి. గోపాల్‌ తన చిత్రాల తరహాలోనే ఆరడుగుల బుల్లెట్‌ని పూర్తి మాస్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దారని తెలుస్తోంది. నయన్‌ తన గ్లామర్‌తో ఆకట్టుకుంటోంది.  ప్రకాష్‌రాజ్‌, అభిమన్యుసింగ్‌, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, జయప్రకాష్‌ రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : బాల మురుగన్‌, మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. నిర్మాణ సంస్థ : జయ బాలాజీ రియల్‌ మీడియా.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events