సంజయ్‌రావు, ప్రణవి మానుకొండ జంటగా నటిస్తున్న చిత్రం స్లమ్ డాగ్ హజ్బెండ్. మైక్ మూవీస్ సంస్థ నిర్మిస్తున్నది. ఏఆర్ శ్రీధర్ దర్శకుడు. పూర్తి కామికల్ ఎంటర్‌టైనర్ గా వస్తోన్న ఈ సినిమాలో బ్రహ్మాజీ, సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ (జూలై 21) పోస్టర్‌ను హీరో సత్య దేవ్ విడుదల చేశారు. దర్శకుడు మట్లాడుతూ పూర్తి వినోదాత్మక చిత్రమిది. ఇందులో ఎలాంటి అడల్ట్ కంటెంట్ ఉండదు. మనుషుల కంటే జంతువులే విధేయంగా ఉంటాయి. ఈ పాయిం ట్ ఆధారంగా ఈ కథను తయారుచేసుకున్నా. తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది అన్నారు.

ఈ సినిమాలో తాను మాస్ పాత్రలో కనిపిస్తానని హీరో సంజయ్‌రావు తెలిపారు. ప్రేక్షకులకు ఆద్యంతం వినోదాన్ని పంచే కంటెంట్‌తో ఈ సినిమాను రూపొందించామని మైక్ టీవీ సీఈవో చక్రధర్ పేర్కొన్నారు. నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ ఈ సినిమా చాలా వినోదాత్మకంగా ఉంటుంది. కొత్త పాయింట్, కొత్త కథ ఇది అని చెప్పారు. బ్రహ్మాజీ మాట్లాడుతూ ఈ సినిమాలో ఓ పాత్ర కోసం నన్ను సంప్రదించారు. తరువాత హీరో కోసం మా అబ్బాయిని తీసుకున్నారు అని తెలిపారు. ఈ నెల 21న విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: శ్రీనివాస్ రెడ్డి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నిర్మాతలు: అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి, రచన-దర్శకత్వం: ఏఆర్ శ్రీధర్. ఈ కార్యక్రమంలో సంజయ్ రావు, ప్రణవి మానుకొండ, నిహార్ దేవెళ్ల, చక్రధర్ తదితరులు పాల్గొన్నారు.

