స్మార్ట్‌ఫోన్‌కు ప్రత్యామ్నాయంగా వాడుకొనేలా ఓ బుల్లి గ్యాడ్జెట్‌ను అమెరికాకు చెందిన స్టార్టప్ హ్యుమానే ఆవిష్కరించింది. ఇది స్మార్ట్‌ఫోన్ తరహాలో అన్ని పనులూ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ డివైజ్‌కు కంపెనీ ఏఐ పిన్ గా నామకరణం చేసింది. ఇది ఎలాంటి స్క్రీన్‌లేని ధరించగలిగే పరికరం. చాలా చిన్నగా ఉండటంతో దీన్ని మన దుస్తులకు ఎక్కడైనా అతికించుకోవచ్చు. కెమెరా, మైక్రోఫోన్, యాక్సెలరోమీటర్, సెన్సార్లు ఉంటాయి. ఇది సెన్సార్లు, ఏఐ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. ఈ డివైజ్‌తో స్మార్ట్‌ఫోన్ తరహాలో కాల్స్, మెసేజెస్ చేసుకోవచ్చు. ఫొటోలు తీసుకోవచ్చు. వీడియోలను రికార్డు చేసుకోవచ్చు. ఇందులో ఉండే బిల్ట్ ఇన్ ప్రొజెక్టర్ సహాయంతో ఇందులోని సమాచారాన్ని చేతులపైనా లేదా గోడలపైనా ఎక్కడైనా డిస్‌ప్లే చేయొచ్చు. అలాగే, ఈ బుల్లి డివైజ్ సహాయంతో ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను మనం ఉన్నచోట నుంచే కంట్రోల్ కూడా చేయొచ్చు.
