మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి ప్రకాశ్‌రాజ్‌పై అపూర్వ విజయం సొంతం చేసుకున్నారు. ప్రకాశ్‌రాజ్‌పై మంచు విష్ణు 106 ఓట్ల తేడాతో గెలుపొందారు. విష్ణుకు 380 ఓట్లు రాగా, ప్రకాశ్‌రాజ్‌కు 274 ఓట్లు వచ్చాయి. మా చరిత్రలోనే అత్యధిక పోలింగ్ నమోదైంది. మా లో మొత్తం 883 మందికి ఓటు హక్కు ఉండగా వారిలో 605 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. విష్ణు ప్యానెల నుంచి ట్రెజరర్‌గా శివబాలాజీ, జనరల్ సెక్రటరీగా రఘుబాబు, జాయింట్ సెక్రటరీగా గౌతమ్ రాజు, వైస్ ప్రెసిడెంట్‌గా మాదాల రవి గెలుపొందారు. విష్ణు ప్యానెల్‌లో ఏడుగురు ఈసీ సభ్యులు గెలిచారు. ఈసీ సభ్యుల్లో ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ ముందంజలో ఉంది. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్‌లో 11 మంది ఈసీ సభ్యులు గెలుపొందారు.
మంచు విష్ణు ప్యానెల్‌లో మాణిక, హరినాథ్, బొప్పన విష్ణు, పసునూరి శ్రీనివాస్, శ్రీలక్ష్మి, జయవాణి, శశాంక్, పూజిత, సంపూర్ణశే బాబు ఈసీ సభ్యులుగా గెలుపొందారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి ఈసీ సభ్యులు శివవారెడ్డితో పాటు కౌశిక్, యాంకర్ అనసూయ, సురేశ్ కొండేటి, బ్రహ్మాజీ, ఖయ్యుం, ప్రగతి గెలుపొందారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్, జాయింట్ సెక్రటరీగా ఉత్తేజ్ గెలుపొందారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)