Namaste NRI

పాట వివాదం .. క్షమాపణలు చెప్పిన మంగ్లీ

కేడీ సినిమా తాలూకు పాట వివాదం దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. కన్నడ చిత్రం కేడీ ది డెవిల్‌ సినిమాలోని పాట ఇది. ధృవ్‌ సర్జా హీరోగా నటించిన ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఇటీవలే కన్నడతో పాటు ఇతర భాషల్లో ఓ పాటను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో హిందీ వెర్షన్‌ పాట సర్కే చునార్‌ తేరి సర్కే అసభ్యకరంగా ఉందని దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలొచ్చాయి. దాంతో ఈ పాటను యూట్యూబ్‌ నుంచి తొలగించారు. హిందీలో తాను పాడిన తొలిపాట సర్కే చునార్‌ తేరి సర్కే వివాదం కావడంపై గాయని మంగ్లీ సోషల్‌ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పింది. ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశ్యం తనకు లేదని తెలిపింది. హిందీ లిరిక్స్‌లో మార్పులు చేశామని, త్వరలో అప్‌డేటెడ్‌ సాంగ్‌ విడుదలవుతుందని ఆమె పేర్కొన్నది.

ఇదిలావుండగా, ఈ పాటలో సంజయ్‌దత్‌తో కలిసి నర్తించిన బాలీవుడ్‌ నటి నోరా ఫతేహి ఈ వివాదంపై స్పందించింది. హిందీ పాట లిరిక్స్‌లో చేసిన మార్పుల గురించి తనకు తెలియదని చెప్పింది. కన్నడ పాట తాలూకు ఇంగ్లీష్‌ ట్రాన్స్‌లేషన్‌ విన్నప్పుడు అసభ్యకరంగా అనిపించలేదు. ఇక హిందీ పాట విషయంలో చిత్రబృందం నా అనుమతి తీసుకోలేద అని ఆమె చెప్పింది.


Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events