నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా నటిస్తున్న చిత్రం సీతా పయనం. అగ్ర నటుడు అర్జున్ దర్శకత్వం. గద్దర్ గారి భార్య విమలా గద్దర్ ఈ సినిమా నుంచి ఏ ఊరికెళ్తావే పిల్లా పాటను లాంచ్ చేసారు. జానపద శైలిలో సాగే ఈ గీతాన్ని చంద్రబోస్ రచించగా, అనూప్‌రూబెన్స్ స్వరాల్ని అందించారు. రాహుల్ సిప్లిగంజ్, మధుప్రియ ఆలపించారు.

పాటలోని సాహిత్యంతో పాటు విజువల్స్, నాయకానాయికల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఓ అమ్మాయి ప్రేమ పయనంలోని అనుభూతులకు అందమైన దృశ్యరూపంలా ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు. సత్యరాజ్, ప్రకాష్‌రాజ్, కోవై సరళ నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌రూబెన్స్, సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: అర్జున్ సర్జా.
















