
ఇంగ్లిష్‌ను అమెరికా అధికార భాషగా గుర్తిస్తూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర్వులు జారీచేయబోతున్నారు. ఇందుకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ఆయన మరికొద్ది గంటల్లో సంతకం చేయబోతున్నట్టు తెలిసింది. ఈ నిర్ణయంతో ఫెడరల్ నిధులు పొందేందుకు ఇంగ్లిష్ భాషలో పత్రాలు, సేవలు అందించటం కొనసాగించాలా? వద్దా? అన్నది ప్రభుత్వ ఏజెన్సీలు, ఇతర సంస్థలు తేల్చుకోవడానికి వీలు కలుగుతుంది.

ఇంగ్లిష్‌ను జాతీయ భాషగా పేర్కొనటం దేశ ఐక్యతను ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వ కార్యకలాపాల్లో సామర్థ్యాన్ని పెంచుతుంది. పౌర సంబంధాలకు మార్గం సుగమం చేస్తుంది అని వైట్‌హౌజ్ ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఇంగ్లిష్‌ను అమెరికా అధికార భాషగా గుర్తించాలన్న డిమాండ్ ఇప్పటిది కాదు. 30కుపైగా రాష్ర్టాలు ఇప్పటికే తమ అధికార భాషగా ఇంగ్లిష్‌ను గుర్తించాయి.
