
కష్టకాలంలో ఆదుకున్న భారత దేశాన్ని శ్రీలంక పట్టించుకోవడం లేదు. శ్రీలంక జలాల నుంచి చైనా పరిశోధక నౌకలు తమపై నిఘా పెట్టే అవకాశం ఉందన్న భారత్ ఆందోళనను శ్రీలంక పెడచెవిన పెట్టింది. జపాన్‌లో పర్యటిస్తున్న శ్రీలంక విదేశాంగ శాఖ మంత్రి అలీ సబ్రీ ఆ దేశ మీడియాతో మాట్లాడుతూ విదేశీ పరిశోధక నౌకలపై తమ దేశం విధించిన మారటోరియం వచ్చే జనవరి వరకు మాత్రమే అమలవుతుంద న్నారు. ఆ తర్వాత దానిని కొనసాగించబోమని చెప్పారు. కేవలం చైనా నౌకలను మాత్రమే అడ్డుకోలేమన్నారు.
