యూకేలోని బ్రాక్నెల్‌లో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ వేంకటేశ్వర బాలాజీ ఆలయ సాంస్కృతిక కేంద్రం (ఎస్వీబీటీసీసీ) ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. ఎస్వీబీటీసీసీ ప్రతిష్ఠిత అర్చకులతో సంప్రదాయ బద్ధంగా నిర్వహించిన రాములవారి కల్యాణోత్సవాన్ని నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు.


ఈ ఆధ్యాత్మిక వేడుకలో అర్చకులు వేదమంత్రాలు, ప్రార్థనలతో ప్రత్యేక పూజలతో నిర్వహించారు. భజనలు, భక్తిగీతాలను ఆలపించారు. అనంతరం భక్తులందరికీ తిరుపతి లడ్డూ ప్రసాదం పంపిణీ చేశారు.ఈ కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు తోడ్పాటు అందించిన వాలంటీర్లు, భక్తులకు ఆలయ నిర్వహణ బృందం కృతజ్ఞతలు తెలిపింది. అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక వేడుకకు దాదాపు మూడు వేల మందికి పైగా భక్తులు, పలువురు రాజకీయ ప్రముఖులు, కౌన్సిలర్లు హాజరయ్యారు.



