Namaste NRI

హంగ్‌కాంగ్‌లో ఘనంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు

ది హాంకాంగ్ తెలుగు సమాఖ్యలో ఆధ్వర్యంలో ఎన్నారైలు విశ్వావసు నామ ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉగాది వేడుకలు తెలుగు కుటుంబాలకు ఎంతో ఉత్సాహాన్నిచ్చాయి. తెలుగు సంవత్సరాదిని ఐక్యతతో, సాంస్కృతిక సంపదతో జరుపుకున్నారు. ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య (టీహెచ్‌కేటీఎస్) నిర్వహించే ఈ కార్యక్రమం, అనధికారికంగా ఇరవై రెండు సంవత్సరాలుగా, పదమూడు సంవత్సరాల అధికారిక సంస్థగా తెలుగు సేవ కొనసాగిస్తోంది. చింగ్ మింగ్ ఉత్సవం కారణంగా హాంకాంగ్‌లో సుదీర్ఘ వారాంతం సెలవులు ఉన్నప్పటికీ, విశేషమైన సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి హాంకాంగ్ అండ్ మకావులోని భారత కాన్సులేట్ జనరల్ నుంచి కాన్సుల్ కూచిభొట్ల వెంకట రమణ,  హోం అఫైర్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ జిల్లా అధికారి మొక్ మాంగ్ చాన్,  ఎన్ఎఎసి టచ్ సెంటర్ ప్రాంతీయ డైరెక్టర్ కోనీ వాంగ్,  హాంకాంగ్‌ బ్యాంక్ లిమిటెడ్ ఉన్నత అధికారి దేవేష్ శర్మ హాజరయ్యారు.

చీకటిని పారద్రోలడానికి, కొత్త ప్రారంభాలను స్వాగతించడానికి ప్రతీకగా గౌరవ అతిథుల దీప ప్రజ్వలనతో ఉగాది వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రముఖుల ప్రసంగాలు సమాజ ప్రయాణం, దాని సభ్యులను బంధించే లక్ష్యం గురించి ప్రతిబింబించాయి. కూచిభొట్ల వెంకట రమణ తెలుగు భాష, సాంస్కృతిక విలువలను పునరుద్ఘాటిస్తూ వీటిని భావి తరాలకు అందించాల్సిన కర్తవ్య ప్రాముఖ్యతని గుర్తుచేశారు. తెలుగు సమాఖ్య ద్వారా హాంగ్‌కాంగ్ తెలుగు ప్రజలకు చేస్తున్న సేవలను ఆయన అభినందించారు.

తన ప్రసంగంలో, తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు హాంకాంగ్‌లోని తెలుగు వారిలో ఒక అనుబంధ భావన, సంబంధాన్ని సృష్టించడం ముఖ్యోద్దేశంగా సంస్థ ప్రయాణం, దాని లక్ష్యం గురించి ప్రతిబింబించారు. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం, సమాజానికి తిరిగి ఇవ్వడం ప్రాముఖ్యతను ఆమె ఎంతో అవసరమని చెప్పారు. హాంకాంగ్, భారతదేశంలోని వెనుకబడిన వర్గాలకు మద్దతు ఇవ్వడానికి తమ సంస్థ చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావించారు.

వినోదాత్మక స్కిట్ వైవిధ్యమైన ప్రదర్శనలను సజావుగా అనుసంధానించింది, ప్రేక్షకుల హర్షధ్వానాలు, కరతాళధ్వనులతో సాంస్కృతికోత్సవం ముగిసింది. ప్రదర్శనలిచ్చిన కళాకారులను కాన్సల్ కూచిభొట్ల వెంకట్ రమణ పురస్కరాలు అందజేస్తూ అభినందించారు.  ఈ వేడుకల్లో పాల్గొన్న వారికి సంప్రదాయ ఉగాది పచ్చడితో పాటు తెలుగు వంటకాలతో భోజనం ఏర్పాటు చేశారు. ఈ వేడుకలు విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events