సంతోష్ శోభన్ హీరోగా ప్రశాంత్ కుమార్ దిమ్మల తెరకెక్కించిన చిత్రం శ్రీదేవి శోభన్‌బాబు. గౌరి జి కిషన్ నాయిక.. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ట్రైలర్‌ను హీరోలు చిరంజీవి, రామ్‌చరణ్ ఇటీవల విడుదల చేశారు. ఈ సినిమాలో శోభన్‌బాబుగా సంతోష్ నటించగా, శ్రీదేవి పాత్రలో గౌరి నటించింది. సంతోష్ ఎక్కువగా మాట్లాడే కుర్రాడిగా కనిపిస్తే గౌరి టెంపర్ ఉన్న అమ్మాయిగా కనిపించింది. విభిన్నమైన వ్యక్తిత్వాలున్న వారి మధ్య జరిగే సంఘర్షణే ఈ చిత్ర ప్రధానాంశం. దీనికి కమ్రాన్ స్వరాలు సమకుర్చారు. శశిధర్ రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరించగా, సిద్ధార్ రామస్వామి ఛాయాగ్రహణం అందించారు. సుష్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. సిద్ధార్ రామస్వామి సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి శశిధర్ రెడ్డి ఎడిటర్‌గా పనిచేశారు.














