అమెరికాలోని సియాటెల్ నగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరలిచారు. ప్రాంగణమంతా వేద మంత్రాలతో మారుమోగింది. కళ్యాణోత్సవ క్రతువులో భాగంగా పుణ్యహవచనం, విశ్వక్సేన ఆరాధన, అంకురార్పణ, మహా సంకల్పం, కన్యాదానం, మాంగల్యధారణ, వారణ మాయిరం, హారతితో శాస్త్రోక్తంగా నిర్వహించారు. టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి దంపతులు, కల్యాణోత్సవానికి ఆర్థిక సహకారం అందించిన పీపుల్ టెక్ సంస్థ సీఎండీ టీజీ విశ్వప్రసాద్‌తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.














