ఇటాలియన్-అమెరికన్ ఆటోమేకర్ స్టెల్లాంటిస్ తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. ఒక్కఫోన్ కాల్‌తో వందల మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది. ఈ మేరకు ఫార్చ్యూన్ మేగజైన్ నివేదించింది. అమెరికా లోని తమ ఇంజినీరింగ్, టెక్నాలజీ డివిజన్‌లో పనిచేస్తున్న సుమారు 400 మంది ఉద్యోగులను ఇంటికి పంపినట్లు ఫార్చ్యూన్ నివేదించింది. ఈ నెల 22వ తేదీన ఉద్యోగులకు రిమోట్ కాల్ ద్వారా లేఆఫ్స్ ప్రకటిం చినట్లు వెల్లడించింది. ఈ కంపెనీకి ఇండియా, మెక్సికో, బ్రెజిల్ తదితర దేశాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సేవలు అందిస్తున్నారు. వారు సమర్థవంతంగా, తక్కువ వేతనాలకే పనిచేస్తుండడంతో వారిని ప్రోత్సహిస్తూ, రెగ్యులర్ ఉద్యోగులను తొలగించినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే, తొలగించిన ఉద్యోగులను వట్టి చేతులతో పంపడం ఇష్టంలేక కొంత మొత్తంలో ప్యాకేజీ చెల్లిస్తున్నట్టు సదరు నివేదికలు పేర్కొన్నాయి.