చైనాపై అగ్రరాజ్యం అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. కొవిడ్‌కు సంబంధించి సమాచారాన్ని మిగతా దేశాలతో పంచుకోవడం లేదని తీవ్రంగా ఆక్షేపించింది. చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై అమెరికా ఆంక్షలను పెంచింది. జిన్‌పింగ్ ప్రభుత్వం కరోనా నిబంధనలను సడలించిన తర్వాత అక్కడ ఇన్‌ఫెక్షన్ నియంత్రణలో లేదని అమెరికా ఆరోపిస్తున్నది. బీజింగ్ నుంచి తమకు ఎలాంటి సమాచారం అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కారణంగా చైనా నుంచి వచ్చే ప్రయాణికులందరిపై కఠిన ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేసింది.
