అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం పరదా. ప్రవీణ్ కాండ్రేగుల దర్శకుడు. శ్రీనివాసులు పి.వి, శ్రీధర్ మక్కువ, విజయ్ డొంకాడ నిర్మాతలు. నేడు ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా అనుపమ విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. పరదా చాలా కొత్త కథ. తెలుగు సినిమాలోనే కాదు, ఇండియన్ సినిమాలోనూ ఇది అరుదైన కథ. డైరెక్టర్ ఈ కథ చెప్పినప్పుడు ఒక ఛాలెంజ్‌గా అనిపించింది. ప్రీమియర్స్ చూసిన చాలామంది నేను కళ్లతోనే కాదు, బాడీ లాంగ్వేజ్, వాయిస్‌తో కూడా యాక్ట్ చేయగలనని అంటుంటే చెప్పలేనంత ఆనందమేసింది అన్నారు.

ఒక యాక్టర్‌కి ఇలాంటి హానెస్ట్‌గా తీసిన సినిమాలు అరుదుగా దొరుకుతాయి. నేను ఎంతో కనెక్టయిన కథ ఇది. ఒక అమ్మాయి మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలదు. సెలబ్రేట్ చేసుకునే సినిమాలతో పాటు ఇలా ఆలోచింపజేసే సినిమాలు కూడా రావాలి. మేము నిజాయితీగా ఓ ప్రయత్నం చేశాం. ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారని నమ్మకంతో ఉన్నాం అని అనుపమ ఆశాభావం వెలిబుచ్చారు. పరదా ఒక బోల్డ్ అటెంప్ట్ అనీ, ఈ సినిమా చూస్తున్నప్పుడు ఒక్క సెకండ్ ఆలోచించగలిగినా అది నేను సక్సెస్‌గా భావిస్తానని అనుపమ చెప్పారు. దర్శన, సంగీతలతో కలిసి నటించడం ఓ గొప్ప ఎక్స్‌పీరియన్స్. గోపీసుందర్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా పరదా అని అనుపమ అన్నారు.
















