సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా నటిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నారు. లక్కీ మీడియా, మహారాజ క్రియేషన్స్ పతాకంపై బెక్కెం వేణుగోపాల్, చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు డి. సురేష్ బాబు, కె.ఎస్ రామారావు, సూర్యదేవర రాదాకృష్ణ, కెఎల్ దామౌదర ప్రసాద్ ఈ పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి చదలవాడ శ్రీనివాస రావు క్లాప్‌నివ్వగా, జెమిని కిరణ్ కెమెరా స్విఛాన్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. ఆద్యంతం చక్కటి వినోదంతో ఆకట్టుకుంటుంది అన్నారు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ఏడాది క్రితం సిద్ధమైంది. వినూత్న కథతో ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది అని నిర్మాతలు తెలిపారు. మంచి కథలో భాగం కావడం ఆనందంగా ఉందని హీరో సుధీర్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బాలాజీ సుబ్రహ్మణ్యం, సంగీతం: లియొన్ జేమ్స్, ఆర్ట్: రాజీవ్ నాయర్, రచయిత: ఫణికృష్ణ సిరికి, దర్శకత్వం: నరేష్ కుప్పిలి.


