Skip to main content

Namaste NRI

సుహాస్‌, సంకీర్త విపిన్‌ జోడీగా కొత్త చిత్రం

సుహాస్‌, సంకీర్తన విపిన్‌ జంటగా ప్రముఖ నిర్మాణ సంస్థ దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ రూపొందిస్తున్న తాజా చిత్రం ప్రారంభమైంది. సందీప్‌ రెడ్డి బండ్ల దర్శకత్వం వహిస్తున్నారు. హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మాతలు. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ క్లాప్‌నిచ్చారు. అనిల్‌ రావిపూడి కెమెరా స్విఛాన్‌ చేశారు.  దిల్‌రాజు, శిరీష్‌ స్క్రిప్ట్‌ను అందించారు. బలగం వంటి ప్రశంసనీయ చిత్రం తర్వాత దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ న్యూటాలెంట్‌ను ప్రోత్సహిస్తూ వరుసగా సినిమాలు చేస్తున్నదని, ఈ బ్యానర్‌లో వస్తున్న నాలుగో చిత్రమిదని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని దర్శకుడు అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాయిశ్రీరామ్‌, సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌, దర్శకత్వం: సందీప్‌ రెడ్డి బండ్ల.

Social Share Spread Message

Latest News