Namaste NRI

రాజమండ్రి రోజ్‌ మిల్క్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన సుకుమార్‌

జైజాస్తి, అనంతిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం రాజమండ్రి రోజ్‌ మిల్క్‌. వెన్నెల కిషోర్‌, ప్రవీణ్‌, ప్రణీత్‌ పట్నాయక్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లో చిత్రం హీరో, హీరోయిన్‌లను ఎవరనేది తెలియజేసింది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ విడుదల చేశారు. దర్శకుడు నాని చిత్ర  విశేషాలను తెలియజేస్తూ పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ యూత్‌పుల్‌ ఎంటర్‌టైనర్‌ అందరికి కాలేజీ రోజులను గుర్తు చేస్తుంది. కాలేజీ రోజుల్లో జరిగిన మరపురాని సంఘటనలను ఈ చిత్రం జ్ఞపిక్తి తెస్తుంది న్నారు. నిర్మాత మాట్లాడుతూ జూన్‌ నుంచి రెండవ షెడ్యూల్‌ను రాజమండ్రి, వైజాగ్‌లో చిత్రీకరిస్తాం. సెప్టెంబర్‌లో విడుదల చేస్తాం అన్నారు. నాన్ని బండ్రెడ్డి దర్శకుడు. సురేష్‌ ప్రొడక్షన్స్‌తో కలిసి ఇంట్రూప్‌ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. డి.సురేష్‌బాబు, ప్రదీప్‌ ఉప్పలపాటి నిర్మాతలు. ఈ చిత్రానికి గోవింద్‌ వసంత్‌, అజయ్‌ అరసాడ, యశ్వంత్‌ నాగ్‌, భరత్‌ సౌరభ్‌లు సంగీతాన్ని అందిస్తున్నారు. ముఖేష్‌, శక్తి అరవింద్‌ సినిమాటోగ్రాఫర్‌లుగా పనిచేస్తున్నారు. 

Social Share Spread Message

Latest News