Namaste NRI

సుమంత్ ప్రభాస్ గోదారి గట్టుపైన మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్

సుమంత్‌ ప్రభాస్‌, నిధి ప్రదీప్‌ జంటగా నటిస్తున్న చిత్రం గోదారి గట్టుపైన. సుభాష్‌చంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. జగపతిబాబు కీలక పాత్రధారి. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. లైట్‌హౌస్‌పైకి తన ప్రేయసిని తీసుకెళ్లిన హీరో అక్కడి నుంచి గోదావరి సముద్రంలో కలిసిపోయే దృశ్యాన్ని చూపిస్తాడు. ఈ సన్నివేశంతో మొదలైన గ్లింప్స్‌ ఆసక్తికరంగా సాగింది.

ఇదే సంగమం. ఇక్కడే గోదారి సముద్రంలో కలుస్తుంది. మంచినీరు ఉప్పునీరు వేరువేరు తత్వాలు అయినప్పటికీ రెండు ఒకటిగా కలిసిపోతున్నాయి. మనుషులు కూడా ఇలా భేదాభిప్రాయాలు లేకుండా కలిసిపోతే ఈ మతభేదాలు ఉండవు కదా అంటూ హీరో చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంది. ఈ చిత్రానికి సంగీతం: నాగవంశీకృష్ణ, నిర్మాత: అభినవ్‌ రావు, రచన-దర్శకత్వం: సుభాష్‌చంద్ర.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events