సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం గోదారి గట్టుపైన. సుభాష్ చంద్ర దర్శకుడు. అభినవ్ రావు నిర్మాత. నిధి ప్రదీప్ కథానాయిక. శుక్రవారం టీజర్‌ను విడుదల చేశారు. గోదావరి నేపథ్యంలో ఓ స్నేహితుల బృందం చేసే అల్లరి, సరదాల నేపథ్యంలో ప్రేమకథగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. రాజు పాత్రలో హీరో సుమంత్ ప్రభాస్ కనిపించారు.

కథానాయిక నిధితో అతని ప్రేమాయణం, ఈ క్రమంలో చోటుచేసుకునే సంఘటనలు వినోదాన్ని పంచాయి. హాస్యం, ప్రేమ, భావోద్వేగాల మేళవింపుతో టీజర్ ఆకట్టుకుంది. ఓ కిటికీ నుంచి పల్లెటూరిని చూసినట్లుగా ఈ సినిమా ఉంటుందని, గోదారి అందాలు కనువిందు చేస్తాయని హీరో సుమంత్‌ప్రభాస్ తెలిపారు. గోదావరి గట్టుపైన నలుగురు స్నేహితులు కూర్చొని సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటే ఎలా ఉంటుందో ఈ సినిమా అలాగే ఉంటుందని దర్శకుడు సుభాష్‌చంద్ర పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: నాగవంశీ కృష్ణ.















