Skip to main content

Namaste NRI

సుమంత్ ప్రభాస్ గోదారి గట్టుపైన టీజర్ రిలీజ్

సుమంత్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న  చిత్రం గోదారి గట్టుపైన. సుభాష్‌ చంద్ర దర్శకుడు. అభినవ్‌ రావు నిర్మాత. నిధి ప్రదీప్‌ కథానాయిక. శుక్రవారం టీజర్‌ను విడుదల చేశారు. గోదావరి నేపథ్యంలో ఓ స్నేహితుల బృందం చేసే అల్లరి, సరదాల నేపథ్యంలో ప్రేమకథగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. రాజు పాత్రలో హీరో సుమంత్‌ ప్రభాస్‌ కనిపించారు.

కథానాయిక నిధితో అతని ప్రేమాయణం, ఈ క్రమంలో చోటుచేసుకునే సంఘటనలు వినోదాన్ని పంచాయి. హాస్యం, ప్రేమ, భావోద్వేగాల మేళవింపుతో టీజర్‌ ఆకట్టుకుంది. ఓ కిటికీ నుంచి పల్లెటూరిని చూసినట్లుగా ఈ సినిమా ఉంటుందని, గోదారి అందాలు కనువిందు చేస్తాయని హీరో సుమంత్‌ప్రభాస్‌ తెలిపారు. గోదావరి గట్టుపైన నలుగురు స్నేహితులు కూర్చొని సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటే ఎలా ఉంటుందో ఈ సినిమా అలాగే ఉంటుందని దర్శకుడు సుభాష్‌చంద్ర పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: నాగవంశీ కృష్ణ.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events