భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ రాక మరింత ఆలస్యం కానున్నది. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమిపైకి చేరాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం నాసా షెడ్యూల్‌ను సవరించింది. దాంతో ఆమె మరోనెల రోజుల పాటు ఇంటర్‌నేషనల్ స్పేస్ స్టేషన్‌లోనే నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురైంది. మార్చిలో తిరిగి భూమిపైకి చేరుకునే అవకాశాలున్నాయి. స్పేస్‌ఎక్స్ క్రూ-10 మిషన్‌లో ఆలస్యం నేపథ్యంలో ఆలస్యమవుతున్నట్లు నాసా పేర్కొంది. వారం రోజుల మిషన్ కోసం సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ జూన్‌లో బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్ షిప్‌లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు. అయితే, సాంకేతిక కారణాలతో అక్కడే చిక్కుకుపోయారు. జూన్ 6న ఇద్దరూ వ్యోమ గాములు ఐఎస్ఎస్‌లోకి వెళ్లగా, అదే నెల 14న తిరిగి భూమిపైకి రావాలి. కానీ, స్టార్ లైనర్‌లో హీలియం లీకేజీ నేపథ్యంలో ప్రయాణం వాయిదా పడింది.