ఐక్యరాజ్య సమితికి చెందిన విద్యా, విజ్ఞాన, సాంస్కృతిక సంస్థ (యునెస్కో)లో తిరిగి చేరేందుకు అగ్రరాజ్యం అమెరికా ఆసక్తి చూపుతున్నది. పాలస్తీనాను సభ్య దేశంగా చేర్చుకున్నందుకు నిరసనగా అలిగి అమెరికా అప్పట్లో బయటకు వెళ్లింది. సంస్థ బకాయిలు చెల్లించేందుకు సిద్ధంగా ఉందని యునెస్కో ప్రతినిధి తెలిపారు. దీంతో యునెస్కోకు, అమెరికాకు మధ్య వివాదానికి తెరపడినట్టేనని భావిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ అంశాల విధాన నిర్ణయంలో చైనా పాత్రకు అడ్డుకట్ట వేయడానికే అమెరికా తిరిగి అడుగుపెడుతున్నదని యూఎస్ అధికారి తెలిపారు.


