Namaste NRI

చైనాతో అగ్రరాజ్యం యుద్ధం : డొనాల్డ్ ట్రంప్

చైనాతో అగ్రరాజ్యం అమెరికా యుద్దం చేసేలా ఉందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ఓవైపు తైవాన్‌ గగనతలంలోకి చైనా యుద్ధ విమానాల దూకుడు పెరుగుతున్న వేళ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని ప్రస్తుత బలహీన, అవినీతి ప్రభుత్వాన్ని చైనా ఏమాత్రం గౌరవించడం లేదని అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందని మరోసారి ట్రంప్‌ ఆరోపించారు. అవినీతి ప్రభుత్వం దేశాన్ని ఏలుతోందని విమర్శించారు. అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా సేనల ఉపసంహరణ సమయంలో బైడెన్‌ ప్రభుత్వం అనుసరించిన తీరును కూడా ట్రంప్‌ తప్పుపట్టారు. 8,500 కోట్ల డాలర్ల విలువైన అత్యాధునిక సైనిక పరికరాలను అఫ్గాన్‌లో వదిలేసి వచ్చాం. ఇప్పుడు వాటిని చైనా, రష్యా రివర్స్‌ ఇంజనీరింగ్‌ ద్వారా సొంతంగా తయారు చేసుకుంటాయి అని అన్నారు. త్వరలో చైనా, అమెరికా ఉన్నతస్థాయి అధికారులు స్విట్జర్లాండ్‌లో సమావేశం కానున్నారన్న వార్తల నేపథ్యంలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events